గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ బెల్లం శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో,
గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ సీఐ శ్రీ ఏ. అశోక్ కుమార్ గారు మరియు వెస్ట్ ట్రాఫిక్ సీఐ శ్రీ సింగయ్య గారు తమ సిబ్బందితో కలిసి గుంటూరు నగర పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తులు క్రింది విధంగా తీర్పులు వెలువరించారు.
గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారు.
* మొత్తం పట్టుబడిన వాహనదారులు:11 మంది.
* ద్విచక్ర వాహనదారులు: 8 మంది.
* 1 వ్యక్తికి రూ. 10,000/- జరిమానా.
* 7 మందికి ఒక్కొక్కరికి రూ. 5,000/- జరిమానా
(మొత్తం జరిమానా మొత్తం : రూ. 45,000/-)
మద్యం సేవించి వాహనం నడిపిన 3 మందికి 3 రోజుల చొప్పున జైలు శిక్ష విధించబడింది.
గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంగ్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారు.
* మొత్తం పట్టుబడిన వాహనదారులు : 6 మంది.
* 3 మందికి ఒక్కొక్కరికి రూ. 7,000/- చొప్పున జరిమానా.
* 2 మందికి ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున జరిమానా
(మొత్తం జరిమానా మొత్తం : రూ. 31,000/-)
* 1 వ్యక్తికి 3 రోజులు జైలు శిక్ష విధించబడింది.
* మొత్తం పట్టుబడిన వాహనదారులు: 17 మంది.
* మొత్తం విధించిన జరిమానా: 13 మందికి రూ. 76,000/-
* మొత్తం జైలు శిక్షలు: 4 మంది
ప్రజలు తమ భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వాహనాలు నడిపిన వారికే కాకుండా, తోటి వాహనదారులకు కూడా ప్రమాదకరంగా ఉంటుందని, ఇటువంటి ఘటనలపై ఇకముందు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
