సినీ హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్
హైదరాబాద్:
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హీరో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ కొల్లూరులోని ఐనా ఈవెంట్ స్పేస్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు అల్లు శిరీష్, నయనికలను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు.
