Friday, January 23, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshనైట్ మానిటరింగ్‌లో సిబ్బందికి హెచ్చరిక |

నైట్ మానిటరింగ్‌లో సిబ్బందికి హెచ్చరిక |

రాత్రి వేళల్లో విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు – నైట్ మానిటరింగ్‌లో సిబ్బందికి ఒంగోలు డీఎస్పీ హెచ్చరిక
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం, రాత్రి వేళల్లో నేరాలను అరికట్టడం

లక్ష్యంగా డిస్ట్రిక్ నైట్ మానిటరింగ్ ఆఫీసర్ హోదాలో ఒంగోలు డీఎస్పీ గారు తాలూకా పోలీస్ స్టేషన్‌తో పాటు బీట్స్, బ్లూ కోర్స్‌లను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తాలూకా పీఎస్ పరిధిలోని నైట్ బీట్ సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించి, రాత్రి పహారా, పికెటింగ్, మొబైల్ గస్తీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. బ్లూ కోర్స్ సిబ్బంది విధులు, రాత్రి సమయంలో స్పందన, గస్తీ నిర్వహణ తీరును పరిశీలించి, ప్రజల భద్రతకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచనలు చేశారు.

డీఎస్పీ గారు మాట్లాడుతూ, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కఠిన నిఘా ఉంచాలని, ముఖ్య కూడళ్లు, నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాల్లో గస్తీ మరింత పెంచాలని ఆదేశించారు. నైట్ బీట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేలా భద్రత కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి, రాత్రి వేళల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే శాంతియుతమైన, సురక్షితమైన ప్రకాశం జిల్లా సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments