గుంటూరు జనవరి 21:పశువులకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందించేందుకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో పశు ఔషధి విక్రయ కేంద్రాల ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు ఆదేశించారు.
ప్రాథమికంగా గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజన్లలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
పశు ఔషధి విక్రయ కేంద్రాలకు అర్హతలు
• సహకార సొసైటీలు / B.Pharmacy లేదా D.Pharmacy అర్హత
• కనీసం 120 చ.అ. స్థలం (స్వంతం/అద్దె)
• Drug Sale License & Pharmacist Registration
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 👉 https://pashuaushadhi.dahd.gov.in
