అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారి పల్లిలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథరెడ్డిని స్థానిక ప్రజలు కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. అనంతరం ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




