Home South Zone Andhra Pradesh బాల కార్మిక వ్యవస్థ – బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం

బాల కార్మిక వ్యవస్థ – బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం

0

గుంటూరు, జనవరి 22: బాల కార్మిక వ్యవస్థ నివారణలో భాగంగా పాన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని జనవరి 26 నుండి మార్చి 31 వరకు విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు, ఐ.ఏ.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ,
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలి

బాల్య వివాహాలను కట్టడి చేయాలి
రక్షించిన పిల్లలను వెంటనే CWC (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ఎదుట భౌతికంగా లేదా వర్చువల్‌గా హాజరు పరచాలి
అనంతరం పునరావాస కేంద్రాలకు తరలించి భవిష్యత్తుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
అని స్పష్టం చేశారు.

పాన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి
స్పష్టమైన షెడ్యూల్ తయారీ
అన్ని శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయం
అత్యవసరమని తెలిపారు.

కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ. గాయత్రి దేవి గారు కార్మిక శాఖ తరపున చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ సమావేశంలో
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య గారు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. ప్రసూన గారు,
బాలల సంరక్షణ అధికారి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
బాల్యం భద్రంగా ఉంటేనే – భవిష్యత్తు బంగారమవుతుంది

NO COMMENTS

Exit mobile version