Home South Zone Andhra Pradesh ఆస్తి కాజేసి.. ఇంటి నుండి గెంటివేత: కూతురిపై కలెక్టర్‌కు వృద్ధుల ఫిర్యాదు.

ఆస్తి కాజేసి.. ఇంటి నుండి గెంటివేత: కూతురిపై కలెక్టర్‌కు వృద్ధుల ఫిర్యాదు.

0

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తమ ఇంటి ఆస్తిని రెండవ కుమార్తె షేక్ రఫియా మోసపూరితంగా తన పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఆరోపిస్తూ వృద్ధదంపతులు షేక్ అబ్దుల్ మజీద్ (89), షేక్ షానాజ్ బేగం (65) సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఇంటి పన్ను విషయమై మునిసిపల్ కార్యాలయంలో విచారించగా ఈ విషయం తెలిసిందని, ప్రస్తుతం కుమార్తె, అల్లుడు కలిసి తమను ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొంటూ, రిజిస్ట్రేషన్ రద్దు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

NO COMMENTS

Exit mobile version