గుంటూరు,చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్ నందు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ శ్రీ మన్నవ మోహన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ వాహన శకటాలను ప్రారంభించి మరియు కేక్ కటింగ్ చేసి అనంతరం,ఈ కార్యక్రమం నుండి ఎన్టీఆర్ స్టేడియం మీదుగా లక్ష్మీపురం సిగ్నల్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.
గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడుతూ:
రేపు జరగబోయే యావత్ తెలుగు ప్రజలందరూ పండుగగా జరుపుకునే మన ప్రియతమ యువనేత రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఒకరోజు ముందుగాన శ్రీ మన్నవ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం ఎంతో అభినందనీయం.
శ్రీ నారా లోకేష్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని,ప్రజలలోకి వాహన శకటాల ద్వారా తీసుకెళ్లాలనేటువంటి సదుద్దేశం ఎంతో ఆనందకరం.
గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లిన ఇంటిముందు ఒక సిమెంట్ రోడ్డు ఉందంటే అదే నారా లోకేష్ గారి వల్లే.
గత వైసిపి పాలనలో అగమ్య గోచారంగా ఉన్నటువంటి యువతకు ధైర్యాన్ని ఇచ్చి, యువగళం ద్వారా మీ భవిష్యత్తుకు నేను అన్నగా ఉంటానని చెప్పిన ఒక ఉన్నతమైన వ్యక్తి మన లోకేష్ గారు.
ఏ పార్టీకి లేనటువంటి క్యాడర్ ను కోటికి పైగా సభ్యత్వాలను స్వీకరించి వారికి రధసారధిగా ఉంటూ వారి కుటుంబాలకు అండగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు.
అతి స్వల్ప కాలంలోనే ఒక పార్టీలో ఒక ఎమర్జడ్ లీడర్ గా ఎదగడమే కాకుండా ఎదగడమే కాకుండా, ఒక పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మనం లోకేష్ గారిని చూస్తే సరిపోతుంది.
20 లక్షల ఉద్యోగాలు కల్పించడం అన్నది ప్రజాస్వామ్యం ఏర్పడినప్పటి నుంచి ఏ నాయకుడు కూడా సాహసం చేయనటువంటి,ఒక వినూతనమైన ఆలోచన చేశారు.
ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో లక్షల ఉద్యోగాలు సృష్టించడం, ఆ లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం శ్రమించడం వారి యొక్క ప్రధాన ధ్యేయం.
మనం తొలుత సంపాదన సృష్టిస్తే ,ఆ తర్వాత ప్రజలకు సంక్షేమాన్ని అందించవచ్చు అనే ఆలోచనతో కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ నక్కా ఆనందబాబు గారు,శ్రీ మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు, శ్రీ కన్నా
లక్ష్మీనారాయణ గారు, శ్రీ మన్నవమో మోహన్ కృష్ణ గారు, శ్రీ డేగల ప్రభాకర్ గారు, శ్రీ కోవెలమూడి రవీంద్ర గారు,శ్రీ పిల్లి మాణిక్యరావు గారు,శ్రీమతి షేక్ సజీల గారు,గళ్లారామచంద్రరావు గారు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, మహిళలు, మరియు తదితరులు పాల్గొన్నారు.




