Amaravati Capital : రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సిద్ధం చేస్తున్న కేంద్రం. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం. 2024 జూన్ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది.Amaravati Capital: ఈనెల 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది.
కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 10 ఏళ్లు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు 2024 జూన్ 2వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్లు కావస్తున్నా ఇంకా దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి నోట్ అందజేసింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో కేంద్ర హోంశాఖ చెప్పాలని అంది. ఈ క్రమంలో 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సంబంధిత కేంద్ర శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరడంతో పలు మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. పట్టణాభివృద్ధి.
న్యాయ శాఖలు ఇంకా అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఉందంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్లో చర్చించి ఆమోదించనుంది. ఈ మేరకు కేబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమగ్నమైందని అధికారులు చెప్పారు.




