Thursday, January 22, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshదావోస్‌లో తమార లేజర్ సీఈవోతో సీఎం చంద్రబాబు భేటీ |

దావోస్‌లో తమార లేజర్ సీఈవోతో సీఎం చంద్రబాబు భేటీ |

దావోస్: ప్రపంచ ఆర్ధిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తమారా లీజర్ సీఈఓ సృష్టి శిబులాల్*
ఆంధ్రప్రదేశ్ లో ఆతిథ్య రంగంలో పెట్టుబడులపై సీఎంతో చర్చించిన తమారా సంస్థ ప్రతినిధులు
• ఏపీలో హోటల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చామని వివరించిన సీఎం
• పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ తీరంలో అద్భుతమైన టూరిజం కేంద్రాలు అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందని తెలిపిన సీఎం

• కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి లాంటి మంచి పర్యాటక ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రారంభించే అంశాలపై చర్చించిన సీఎం
• ప్రస్తుతం ప్రతీ పర్యాటక ప్రాంతానికీ రోడ్లు, ఎయిర్ పోర్టులు అందుబాటులో ఉన్నాయని ఇప్పుడు ఏపీ అన్ లాక్ అని తమారా లీజర్ ప్రతినిధులకు వివరించిన ముఖ్యమంత్రి

• టూరిజం ఆర్ధిక వ్యవస్థను పెంచుతుందని .. ఉపాధి కల్పిస్తుందని వెల్లడి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ ప్రతీ జిల్లాలలోనూ పర్యాటక కేంద్రాలున్నాయని స్పష్టం
• హోటల్ రంగానికి మేం ప్రోత్సాహం ఇస్తున్నామని వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• ఏపీలో ప్రాజెక్టులు పెట్టేందుకు ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని స్పష్టం చేసిన సీఎం.

• గిరిజన ప్రాంతాల్లోనూ ఎకోటూరిజం పార్కులు ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపిన తమారా లీజర్ సంస్థ
• విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడి
• కమ్యూనిటీ ఫస్ట్ అనే నినాదంతో గిరిజన యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు కూడా సిద్ధమని సీఎంకు వివరించిన సంస్థ ప్రతినిధులు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments