Thursday, January 22, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమహిళకు న్యాయం: జనసేన ఎమ్మెల్యే చొరవ |

మహిళకు న్యాయం: జనసేన ఎమ్మెల్యే చొరవ |

జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవ.. మహిళ 18 ఏళ్ల నరకయాతనకు విముక్తి..

పనికోసం మలేషియా వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన తాడేపల్లిగూడెం మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. వెంకటరమణ అనే మహిళ సుమారుగా 18 ఏళ్ల కిందట పనికోసం మలేషియా వెళ్లారు. అయితే అక్కడే చిక్కుకుపోయారు. అక్కడి యజమానులు పాస్‌పోర్టు తీసుకుని వెనక్కి రానీయకుండా ఇన్నేళ్లపాటు వెట్టిచాకిరీ చేయించుకున్నారు. అయితే తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవతో ఆమె 18 ఏళ్ల తర్వాత సొంతూరికి చేరుకున్నారు. మలేషియాలోని జనసేన ఎన్ఆర్ఐల సహకారంతో ఆమెను సొంతూరికి తీసుకొచ్చారు బొలిశెట్టి..

తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని విదేశాలకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన ఓ మహిళను సుమారు 18 ఏళ్ల తర్వాత సొంతూరికి చేర్చారు. మలేసియాలో 18 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించిన మహిళకు.. ఆ వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు.బ్రతుకుతెరువు కోసం వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన తాడేపల్లిగూడెం మహిళను, మలేషియాలోని జనసైనికుల సహకారంతో వెతికి, చట్టపరమైన సమస్యలు పరిష్కరించి, ఆమెను తన కుమారులతో కలిసి సురక్షితంగా సొంతూరు తీసుకొచ్చారు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లిగూడెనికి చెందిన కుప్పు వెంకటరమణ అనే మహిళ 18 ఏళ్ల క్రితం పనికోసం మలేషియా వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెకు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడి యజమానులు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సొంతూరికి తిరిగి వెళ్దామంటే పాస్‌పోర్టు తీసుకుని భారతదేశానికి మళ్లీ రాకుండా అక్కడే నిర్భంధించారు.

దీంతో ఇన్నేళ్లుగా వెంకటరమణ అక్కడే వెట్టిచాకిరీ చేస్తూ నరకయాతన అనుభవించారు. అయితే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ‌కు ఈ విషయం తెలిసింది. దీంతో మలేషియాలోని ఎన్ఆర్ఐ జనసైనికుల ద్వారా వెంకటరమణను సొంతూరు చేర్చారు. సొంత ఖర్చులతో ఆమెను ఇంటికి చేర్చారు. దీంతో మహిళ కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన పనికి నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు.
మరోవైపు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గతంలోనూ పలువురికి సహాయపడ్డారు. పుట్టుకతోనే గుండెకు రంధ్రంతో జన్మించిన ఓ చిన్నారికి అండగా నిలిచారు.

తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చిన్నారికి ఆపరేషన్ చేయించారు.10 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్‌ను స్విమ్స్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఉచితంగా చేయించి, ఆ పసికందు ప్రాణాలు నిలబెట్టారు. దీంతో ఆ చిన్నారి కుటుంబసభ్యులు బొలిశెట్టికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే ప్రమాదంలో అమ్మానాన్నలను కోల్పోయిన ఓ బాలికకు కూడా అండగా నిలిచారు బొలిశెట్టి. అనాథగా మారిన చిన్నారి బాగోగుల కోసం.. తన జీతాన్ని విరాళంగా అందించారు. బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన పనికి పలువురు ప్రశంసలు కురిపించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments