విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లిన తన భర్త రాజేంద్ర నాయుడు ఆచూకీ తెలపాలంటూ దుర్గ భవాని అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
ఏఎన్ఆర్ టమాటా మండి మేనేజర్ గా పని చేస్తున్న అతడిని మూడు రోజుల క్రితం తీసుకెళ్లారని ఆమె పేర్కొన్నారు. భర్తను అప్పగిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మండి నిర్వాహకులు సైతం బాధితురాలికి మద్దతుగా నిలిచారు.




