హైదరాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి) ‘టీం ఇండియా’ ఈ పేరుపై దాఖలైన ఓ పిటిషన్ పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బీసీసీఐ ఆధ్వర్యంలోని భారత క్రికెట్ జట్టును ‘టీం ఇండియా’ అని పిలవకుండా ప్రసార భారతి ని ఆదేశించాలను కోరుతూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.
ఇలాంటి పిటీషన్లతో న్యాయస్థానాల సమయాన్ని వృధా చేయవద్దని, కోర్టులపై అనవసరమైన భారాన్ని మోపవద్దని పిటిషనర్కు న్యాయస్థానం చురకలంటించింది. ‘క్రికెట్ టీం పేరు అంశాలలో కోర్టుల జోక్యం ఏంటని’ పిటిషనర్ను ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
#sidhumaroju




