దావోస్ పెట్టుబడులపై ఏపీ బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష
దావోస్ పర్యటనలో తొలి రెండు రోజుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ బృందంతో కీలక సమీక్ష నిర్వహించారు.
వివిధ దేశాల ప్రతినిధులు ఆసక్తి చూపిన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, చర్చలు కేవలం
సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పెట్టుబడులుగా మారాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతిపాదిత ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఫాలో అప్ చేయాలని సీఎం స్పష్టం చేశారు.






