ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*
విజయవాడ నగర ట్రాఫిక్ భద్రత & బ్యూటిఫికేషన్ దిశగా కీలక చర్చ.*
పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి దిశానిర్దేశంలో విజయవాడ నగరంలో టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ రెగ్యులేషన్, ప్రమాదాల నివారణ, రోడ్ సేఫ్టీ అవగాహన అంశాలపై ట్రాఫిక్ విభాగం నిరంతరం కృషి చేస్తుంది.*
ట్రాఫిక్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ శ్రీమతి షేక్ షరీన్ బేగం ఐపీఎస్ గారి నేతృత్వంలో, ఈరోజు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ మరియు ఫ్యాకల్టీతో కలిసి విజయవాడ నగర పరిధిలోని బిజీ జంక్షన్లు మరియు బిజీ ఏరియాలను సురక్షితంగా, ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడంపై చర్చించడం జరిగింది.*
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది:*
Tactical Urbanism కాన్సెప్ట్ ఆధారంగా బిజీ జంక్షన్ల డిజైన్స్ లను మెరుగుపరచడం*
రోడ్ల బ్యూటిఫికేషన్‌తో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు శాస్త్రీయ మార్గాలపై ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడేలా డిజైన్లు, లేఅవుట్లు, సూచనలు*
ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను సురక్షిత జోన్లుగా మార్చే కార్యాచరణ*
ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుండి అందిన సలహాలు, సూచనలు, డిజైన్లను దశలవారీగా అమలు చేయడానికి, Tactical Urbanism కాన్సెప్ట్‌ను విజయవాడ నగరంలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది*.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ – డాక్టర్ Prof. D. Ramesh Srikonda & ఇతర ఫ్యాకల్టీ, ట్రాఫిక్ ఏసిపిలు – వంశీధర్ గౌడ్, రామచంద్రరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు – బాలమురళి, రామారావు, రవికుమార్, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.*




