క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి “ఇన్చార్జ్ గౌతమ్ కుమార్”
(భారత్ అవాజ్ న్యూస్) ఉరవకొండ జనవరి 23: ఈరోజు ఉరవకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో ఇంచార్జ్ ‘గౌతమ్ కుమార్’ గ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు “పవన్ కళ్యాణ్” ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఉరవకొండ నియోజకవర్గం లో బలోపేత దిశగా జన సైనికులు కలిసి మెలిసి ఐదు మండలాల్లో అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతం కొరకు జనసైనికులు పాటుపడాలని తెలియజేశారు అదేవిధంగా కూటమి జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులతో ఐక్యంగా ఉండాలంటూ తెలియజేశారు.
జనసేన పార్టీ రాష్ట్ర జనసేన పార్టీ ఆదేశాల మేరకు, నూతన మండల కమిటీలు, మరియు గ్రామస్థాయిలో కమిటీలు, వార్డు ఇంచార్జలు త్వరలో పూర్తిస్థాయిలో నిర్మించడం జరుగుతుందనీ చర్చించడం జరిగింది.
మరియు అలానే రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్ళాలో ఈ సమావేశంలో తెలియచేయడం జరిగింది. మరియు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా నియోజవర్గ నాయకులకు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల కన్వీనర్ చంద్రశేఖర్, వజ్రకరూరు మండల కన్వీనర్ అచనల కేశవ్, కూడేరు మండల కన్వీనర్ నాగేష్, బెలుగుప్ప మండల కన్వీనర్ సుధీర్, నాయకులు దేవేంద్ర, రాజేష్, హరి శంకర్ నాయక్, రమేష్, తిలక్, మల్లికార్జున, నీలకంఠ, మణి కుమార్, అనిల్, బోగేష్, సోము, ధనంజయ్, భద్ర, రమేష్, బీమా, రమణ, అభి, శేఖర్, వర్మ, తదితరులు పాల్గొన్నారు.
