మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం 133 డివిజన్ MES కాలనీలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. కాలనీవాసులు సొంత నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. డ్రైనేజీ పనులు పూర్తి అయిన వెంటనే సీసీ(CC) రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. దీనిపై కార్పొరేటర్ సానుకూలంగా స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో కాలనీలోని సిసి రోడ్ల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
#sidhumaroju




