Sunday, January 25, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshగుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు |

గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు |

గుడివాడ ఖ్యాతి మరింత పెరిగేలా జాతీయ కబడ్డీ పోటీలు: విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని
దిగ్విజయంగా ముగిసిన నేషనల్ స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలు….
విజేతగా నిలిచిన హర్యాన….రన్నర్ గా హిమాచల్ ప్రదేశ్
ఫైనల్ పోటీలకు వేలాదిగా హాజరైన… ప్రేక్షకులు, విద్యార్థులు
గుడివాడలో అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు:వివిధ రాష్ట్రాల కోచ్ లు,క్రీడాకారులు
ఎమ్మెల్యే రాము ఇచ్చిన సహకారాన్ని ఎన్నటికీ మరువలేం:ఫెడరేషన్ పెద్దలు
ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి మేరకు,గుడివాడలో ఆరు ఎకరాల్లో….. క్రికెట్ పిచ్ అభివృద్ధి చేస్తాం: ఎంపీ చిన్ని

ప్రజల సహకారంతో గుడివాడలో మరిన్ని జాతీయ పోటీలు నిర్వహిస్తాం: ఎమ్మెల్యే రాము

జనవరి 23: గుడివాడ ఖ్యాతి పెంపొందేలా జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతంగా జరగడం సంతోషకరమని విజయవాడ ఎంపీ కేసీనేని చిన్ని హర్షం వ్యక్తం చేశారు. పట్టణాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో మంత్రి లోకేష్ ఇచ్చిన అవకాశాన్ని, టోర్నమెంట్ విజయవంతంతో గుడివాడ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని కొనియాడారు.

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న….69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ – 14 బాలికల జాతీయ కబడ్డీ పోటీలు,విజయవంతంగా ముగిసాయి. శుక్రవారం జరిగిన ఫైనల్ పోటీల్లో… హిమాచల్ ప్రదేశ్ జట్టుపై, హర్యానా జట్టు విజయం సాధించి ప్రథమ స్థానంలో, నిలవగా హర్యానా ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. మూడు,నాలుగు స్థానాలకు జరిగిన పోటీల్లో తమిళనాడు జట్టుపై మహారాష్ట్ర జట్టు విజయం సాధించింది.

ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని… ఫైనల్ పోటీలను విజయవాడ ఎంపీ కేసీనేని చిన్ని ప్రారంభించారు. ఫైనల్ పోటీలను తిలకించేందుకు వేలాదిగా ప్రేక్షకులు, హాజరయ్యారు. ప్రేక్షకులతో కలిసి ఎమ్మెల్యే రాము – సుఖద దంపతులు, పట్టణ ప్రముఖులు క్రీడాకారులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేసీనేని చిన్ని మాట్లాడుతూ…. గుడివాడ లాంటి చిన్న పట్టణంలో జాతీయ క్రీడలు విజయవంతంగా జరగడం సంతోషకరమన్నారు. పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలన్న మంత్రి లోకేష్ ఆకాంక్షలకు అనుగుణంగా గుడివాడలో జాతీయ క్రీడలకు అవకాశం ఇచ్చారన్నారు.

లోకేష్ పుట్టినరోజున ఆయనకు శుభాకాంక్షలు గా ఫైనల్ పోటీలు జరగడం హర్షనీయమన్నారు. గుడివాడ మీద ప్రేమ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో ఎమ్మెల్యే రాము ప్రత్యక్షంగా చూపించారని కొనియాడారు. గుడివాడ ప్రజలు మరిన్ని జాతీయ పోటీలను రానున్న రోజుల్లో చూస్తారన్నారు.

నేషనల్ టోర్నమెంట్ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, చక్కటి ఆతిథ్యం ఇచ్చిన ఎమ్మెల్యే రాము ,నిర్వాహకులను ఎంపీ చిన్ని అభినందించారు. పోటీల్లో క్రీడాకారులు చక్కటి ప్రదర్శన చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి మేరకు స్టేడియంలో క్రీడల అభివృద్ధికి, గుడివాడలో ఆరు ఎకరాల్లో క్రికెట్ పిచ్ ఏర్పాటుకు చేస్తామని ఎంపీ చిన్ని హామీ ఇచ్చారు.

గుడివాడ ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన సోదరుడు కేశినేని చిన్ని, గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడల అభివృద్ధి, క్రికెట్ క్రీడాకారుల ప్రోత్సాహకానికి సహకరిస్తానని ముందుకు రావడం సంతోషకరమన్నారు. గుడివాడ ప్రజల తరఫున ఎంపీ చిన్నికు…. ధన్యవాదాలు చెబుతున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ…. అందరూ కలిసి గుడివాడలో పెద్ద ఎత్తున జాతీయ క్రీడలను విజయవంతం చేయడం మంచి విషయం అన్నారు.

గుడివాడలో మర్చిపోలేని విధంగా చక్కటి ఆతిథ్యం ఇచ్చారని వివిధ రాష్ట్రాలకు చెందిన కోచ్ లు, మరియు క్రీడాకారులు పేర్కొన్నారు. తమకు చక్కటి వసతులు కల్పించిన ఎమ్మెల్యే రాము, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

పోటీలు ఎంతో ఘనంగా జరిగేలా గుడివాడ ఎమ్మెల్యే రాము అందించిన సహకారాన్ని ఎన్నటికీ మరువలేమని, ఫెడరేషన్ పెద్దలు పేర్కొన్నారు.

అనంతరం ఫెడరేషన్ పెద్దలు, కోచ్ లు, స్పోర్ట్స్ కమిటీల పెద్దలు, సీనియర్ క్రీడాకారులను ఎమ్మెల్యే రాము సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు , ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్,గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ కన్వీనర్ సజ్జా బర్నబాస్, గుడివాడ మండల, నందివాడ మండల టిడిపి అధ్యక్షులు వాసే మురళి, దానేటి సన్యాసిరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,టిడిపి నాయకులు పండ్రాజు సాంబయ్య, పిన్నమనేని బాబ్జి,లింగం ప్రసాద్,చేకూరు జగన్మోహన్రావు, గోకవరపు సునీల్, కిలారపు రంగ ప్రసాద్, ఏపీ క్రీడా శాఖ, స్కూల్ గేమ్ ఫెడరేషన్ పెద్దలు, విద్యాశాఖ అధికారులు, వేలాదిగా ప్రేక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments