బాపట్ల: మండలంలోని ఈతేరు గ్రామంలో శుక్రవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పాడి రైతులందరూ పశు వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని పశువులు వ్యాధిబారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను రైతులకు వివరించారు. ఈ శిబిరంలో పశు వైద్యాధికారి డాక్టర్ రేచల్ దివ్య గేదెలకు గర్భ కోస మరియు సాధారణ వ్యాధులకు చికిత్స అందించారు .
దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ మరియు గొర్రెలు బొబ్బరోగం బారిన పడకుండా టీకాలు వేశారు. ఈ శిబిరంలో గ్రామ సర్పంచ్ దమ్ము మార్తమ్మ, బాపట్ల రూరల్ టిడిపి అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, బాపట్ల మండలం టిడిపి మహిళా అధ్యక్షురాలు కాగిత నాగభూషణ కుమారి, టిడిపి సీనియర్ నాయకులు మన్నెం సాంబశివరావు మరియు పశు వైద్య సిబ్బంది కె ఎస్ ఆర్ కె ప్రసాద్, పి వెంకటేశ్వరరావు, నాగరాజు, వెన్నెల, నరేంద్ర మరియు చరిత , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
#Narendra






