చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద శుక్రవారం విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. అనంతరం పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దేశాది ప్రకాష్, సుబ్రహ్మణ్యం రాజు, జంపాల చిన్న మోహన్ నాయుడు, మధు రాయల్ తో పాటు పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




