Home South Zone Andhra Pradesh పుంగనూరు: అవాస్తవాలు ప్రచారం చేయకండి

పుంగనూరు: అవాస్తవాలు ప్రచారం చేయకండి

0
0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం 210 మంది జంటలు అభిషేక పూజలో పాల్గొన్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం తెలిపారు.

శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు అభిషేక పూజలో కేవలం 10 జంటలు మాత్రమే పాల్గొన్నాయని స్పష్టం చేశారు. ఆలయ అధికారుల వద్ద సరైన వివరాలు సేకరించి ప్రచురణ చేయాలని, అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన కోరారు

# కొత్తూరుమురళి .

NO COMMENTS