మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ మరియు ఇంద్రనగర్ కాలనీ వాసుల దశాబ్దాల వరద కష్టాలకు చెప్పి పెట్టేందుకు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి నడుం బిగించారు. ఆయన ఆదేశాల మేరకు అనిల్ కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో హైడ్రా (hydraa) కమిషనర్ రంగనాథ్ ని కలిసి పత్రం అందజేశారు.
డ్రైనేజీ మరియు వరద కాలువలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాల వల్ల వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందని వాటిని వెంటనే తొలగించాలని వారు కోరారు. ప్రజా ప్రయోజనాల దృష్టా నిర్మాణాలపై కఠిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో మోసిన్, విజయ్ శేఖర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju




