మదనపల్లిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, ఆర్టీఓ అశోక్ ప్రతాప్‌రావ్ స్థానిక విద్యార్థులతో రోడ్డు భద్రతా నియమాలపై ప్రమాణం చేయించారు. గురువారం పట్టణ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి
బెంగుళూరు బస్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ వాడకం, మద్యం సేవించి డ్రైవింగ్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడపబోమని విద్యార్థులు ప్రమాణం చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్టీఓ తెలిపారు.




