మదనపల్లి మీదుగా తమిళనాడు వైపు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి జనసేన నాయకులు రాయల్ గణి, అమర్నాథ్, సురేష్, నాయుడు, అరుణాచలం, గట్టు చంద్రలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బైపాస్ రోడ్డులోని రాయల్ వుడ్ ఎదుట కంటైనర్లో కబేళాలకు తరలిస్తున్న గోవులను గుర్తించి
అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో, పట్టుబడ్డ గోవులతో ఉన్న లారీని టమాటా మార్కెట్ యార్డుకు తరలించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
