యువ నాయకత్వానికి చిరునామా మంత్రి నారా లోకేష్
నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి, రాష్ట్ర రాజకీయాల్లో యువతకు నమ్మకమైన స్వరం, ఆధునిక ఆలోచనలకు ప్రతీక అయిన శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ఆలోచనలో ఆధునికత్వం, దూర దృష్టి, చర్యల్లో దృఢత్వం, నిర్ణయాల్లో స్పష్టత కలిగిన యువనేత నారా లోకేష్ గారు ఈ తరానికి ప్రేరణ. విద్యను ఆయుధంగా చేసుకుని రాష్ట్ర భవిష్యత్తును మలుస్తున్న నాయకుడు.
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో, విద్యారంగంలో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన నాయకుడిగా నారా లోకేష్ గారు నిలిచారనటంలో సందేహం లేదు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, యువతకు నైపుణ్యాలు, విద్యార్థులకు అవకాశాలు, ఉపాధికి దారులు చూపుతున్న దార్శనికుడు నారా లోకేష్.
నిన్నటి నాయకత్వానికి వారసుడిగా కాకుండా, రేపటి రాజకీయాలకు దిశానిర్దేశం చేసే యువ శక్తిగా నారా లోకేష్ ఎదిగారు. ప్రజల కోసం ఆలోచించే నాయకుడు, యువత కోసం పోరాడే నాయకుడు ఆయన.
రాష్ట్రాన్ని జ్ఞాన,ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నారా లోకేష్ గారు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజల ఆశీస్సులతో మరింత ఎత్తుకు ఎదగాలని మనః స్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను
