AP: వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఇప్పటికే యూనిట్‌కు 13 పైసలు ట్రూ డౌన్ చేశామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో యూనిట్‌పై రూ.1.19 తగ్గించి రూ.4కే ఇస్తామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.5.19 ఉండేదని, అందులో 29 పైసలు తగ్గించామని చెప్పారు. మరో 90 పైసలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.




