AP: చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
వ్యర్ధాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను, మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు.




