కర్నూలు
డోన్ అభివృద్ధి బాటలో మరో కీలక ఘట్టం :
రూ.19 లక్షలతో సీసీ కాలువల నిర్మాణానికి భూమి పూజఈ రోజు డోన్ పట్టణంలోని 3వ వార్డు స్వీపర్స్ కాలనీ లో రూ.19 లక్షల వ్యయంతో సీసీ కాలువల నిర్మాణ పనులకు గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ, డోన్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.సీసీ కాలువల నిర్మాణంతో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తొలగి, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా మరియు పరిశుభ్రమైన పరిసరాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ భూమి పూజ కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
