స్టూవర్టుపురం,బాపట్ల: నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు: స్టూవర్టుపురం ST హాస్టల్‌లో విద్యార్ధులకి నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు. యువనేత, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఈరోజు బాపట్ల మండలం, స్టూవర్టుపురం గ్రామంలోని ST హాస్టల్‌లో విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ గారు విద్యార్థులతో కలిసి నారా లోకేష్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, సాదు నాగేశ్వరావు, భోగిరి రామారావు, నాగేష్, భోగిరి పృధ్వీ రాజ్, ఇతర కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
#Narendra
