Sunday, January 25, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!

అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!

కర్నూలు
వసంత పంచమి సందర్భంగా విద్యా సంస్కారానికి శ్రీకారం – స్వీపర్స్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన డోన్ ఎమ్మెల్యేవసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని డోన్ పట్టణంలోని స్వీపర్స్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు పాల్గొని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి, విద్యా ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, చిన్న వయసులోనే విద్యపై ఆసక్తి పెంపొందించడం ద్వారా సమాజ భవిష్యత్తు మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రతి పిల్లవాడు చదువులో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అంగన్వాడీ కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments