ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న వైసీపీ నేత విజయసాయిరెడ్డిని గురువారం ఈడీ విచారించింది.
విదేశాలకు అక్రమంగా నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటు అంశాలపై అధికారులు లోతుగా ఆరా తీశారు. ఇదే కేసులో భాగంగా నేడు (శుక్రవారం) వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు.
లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.




