Home South Zone Andhra Pradesh క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలి: చల్లపల్లి నరసింహరెడ్డి.

క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలి: చల్లపల్లి నరసింహరెడ్డి.

0
1

మదనపల్లె మండలం, గంగన్నగారిపల్లెలోని శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలో వార్షిక క్రీడోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ బ్యాటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. విజయ భారతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.సేతు టాస్ వేసి మొదటి మ్యాచ్‌ను ప్రారంభించారు.

ఈ క్రీడల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, టెన్నికాయిట్, అథ్లెటిక్స్ వంటి వివిధ పోటీలు నిర్వహిస్తామని కాలేజీల కరెస్పాండెంట్ బి.శశి వర్ధన్ రెడ్డి తెలిపారు.

NO COMMENTS