మెదక్ జిల్లా కేంద్రంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవంలో “నా భారత్ – నా ఓటు” అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించరు. ఈనెల 25వ తారీఖున ఓటర్ నమోదుపై ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. నూతనంగా నమోదు కాబడిన ఓటర్లను గుర్తించి వారికి ఓటరు గుర్తింపు కార్డులను అందించడం జరుగుతుందని.
ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటరు దినోత్సవ నినాదాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో ఓటరు ప్రతిజ్ఞ చేయాలని సంబంధిత ఫోటోలు.
వీడియోలను ఆయా శాఖల సోషల్ మీడియా ఖాతాలలో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.ఓటరు ప్రతిజ్ఞ వాట్సాప్ గ్రూపుల ద్వారా అందరికీ చేరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ఓటరు నమోదు ప్రతిజ్ఞ చేశారు.




