దావోస్ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేటి ఉదయం ఉండవల్లికి చేరుకున్నారు.
ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మంత్రులు, సహచర శాసనసభ్యులతో కలిసి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని కలిసి దావోస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు.






