Sunday, January 25, 2026
spot_img
HomeSouth ZoneAndhra PradeshAmaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.

Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.

14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు
ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల కేటాయింపు
ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్ల కేటాయింపు.

రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ-లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

అలాగే, ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇవ్వనున్నారు. అక్కడి 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఈ-లాటరీ నిర్వహిస్తారు. మరోవైపు, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన

తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే, మరోవైపు భవిష్యత్ అవసరాలు, విస్తరణ కోసం భూ సేకరణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments