Tirumala Crowded with Devotees Sarvadarshan Takes 24 Hours
శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు
భక్తులతో నిండిపోయిన అన్ని కంపార్టుమెంట్లు
నిన్న స్వామిని దర్శించుకున్న 69,726 మంది భక్తులు.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో తిరుమల జనసంద్రంగా మారింది. కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
మరోవైపు, స్వామి వారిని నిన్న 69,726 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 27,832 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ. 4.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.




