AP: తిరుమలకు 2019-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినా టీటీడీ అడ్డుకోలేకపోయిందని నెల్లూరు కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని డెయిరీ అంతకుముందు నెయ్యి సరఫరా చేయగా, తగిన సామర్థ్యం, అనుభవం లేని ఏఆర్ డెయిరీకి టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారని ఆరోపించింది. ఏఆర్‌కు కాంట్రాక్ట్ ఇచ్చినా, తెరవెనక భోలేబాబా సబ్ కాంట్రాక్ట్ పొంది నెయ్యి సరఫరా చేసిందని దర్యాప్తు సంస్థ తెలిపింది.




