దర్శిలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ
కూటమి ప్రభుత్వంనుంచి దర్శి నియోజకవర్గంలోని అనారోగ్య బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ లబ్ధిదారులకు మరియు వారి కుటుంబసభ్యులకు అందజేశారు.
దర్శిలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో CMRF చెక్కులు మరియు LOCలు కలిపి మొత్తం 107 మందికి రూ. 87,16,054 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.






