అన్నమయ్య జిల్లా డీపీఎం ధర్మరాజు పెన్షన్ డబ్బును లబ్ధిదారులకు ఇవ్వకుండా పన్నులు లేదా ఇతర అవసరాలకు జమచేస్తే సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. గురువారం మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో
పెన్షన్ పంపిణీ చేసే సచివాలయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో, ప్రతి నెల ఒకటో తేదీన వంద శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పెన్షన్ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.




