కర్నూలు సిటీ :
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారి కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు…వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసిన ఎంపీ నాగరాజు గారు , నారా లోకేష్ గారికి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు..
అనంతరం ఎంపీ గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు..ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు గారు రక్తదానం చేశారు…అనంతరం ఎంపీ గారు మాట్లాడుతూ 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి లోకేష్ గారు తీవ్రంగా కృషి చేసారన్నారు..
లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, రానున్న రోజుల్లో ఆయన సీ.ఎం అవుతారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ గారు , వెంకటరాముడు గారు, ఉదయ్ కుమార్ గారు , టీడీపీ జిల్లా కార్యదర్శి మద్దిలేటి గారు , జిల్లా ఉపాధ్యక్షులు తిరుమలేష్ గారు , 40వ వార్డు ఇంచార్జి చంద్రశేఖర్ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…




