ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా_
_ఇన్ని భూములు ఉండి ముస్లిం మైనార్టీలు పేదరికంలో ఉంటానికి కారణాలేంటి.._?
_ముస్లిం ఉంటానికి ఇల్లు లేక, ముస్లింలంటే ఇల్లు అద్దెకు ఇవ్వక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ముస్లింలు లేగా
_ప్రభుత్వాలు ఎన్ని మారినా ముస్లిం మైనార్టీల తలరాతలు మారవా ముస్లిం మైనార్టీల రక్షణ కోసం ఏర్పడిన వక్ఫ్ సంస్థ మైనార్టీ భూములు ఇష్టానుసారంగా ఎక్వేర్ పేరుతో తీసుకుంటే వక్ఫ్ సంస్థ లో ఉన్న బాధ్యతగల వ్యక్తులు మౌనవహించడంలో ఆంతర్యం ఏమిటి…?_
_విజయవాడ పోరంకి సీతారాంపురం నారాయణపురం కాలనీ 50 ఎకరాలు 80 వేలకు ఎకరం చొప్పున ఖాజీ మన్యం రాఘవ ఎస్టేట్ కు దారతత్వం చేసింది ఎవరు_
_నిడమనూరు ఖాజీ మన్యం అతి తక్కువ ధర ఎకరం 6 లక్షలకు 40 ఎకరాలు అమ్మేసింది ఎవరు ఆ డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవా.._
_తాడిగడప ఖాజీ మన్యం భూములకు ఎన్వోసీ అధికారులు ఎందుకు ఇచ్చారు…_
_మైనార్టీ భూములు అతి తక్కువ ధరకు తీసుకొని కోట్ల రూపాయలకు రియల్ ఎస్టేట్ చేస్తుంది ఎవరు ఇంత దారుణం జరుగుతున్న మైనార్టీ బాధ్యత గల అధికారులు ఎక్కడ…..ఏమి చర్యలు తీసుకున్నారు ప్రజలకు చెప్పే గలరా.._
_ప్రభుత్వాలు తీసుకున్న వక్ఫ్ భూముల వలన మైనార్టీలకు ఏమైనా లాభం జరిగిందా.. పరిశ్రమలు నిర్మించి ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చారా.. మా భూములు తీసుకుని వ్యాపారాలు చేసుకొని కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించవచ్చు మైనార్టీలు మాత్రం పకీర్లుగా మిగిలిపోవాలి ఇదేనా ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి…_
_మా హాక్కుల కోసం మా భూములు కాపాడుకోవడం కోసం రోడ్డు మీదకు వచ్చి ఉద్యమాలు చెయ్యాలా ఏమిటి ఈ దుర్మార్గం ఎందుకు ఇంత వివక్ష.._
_మంగళగిరి అంజుమన్ భూములు ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు మైనార్టీలతో కనీసం సమీక్ష నిర్వహించే బాధ్యత అధికారులకు లేదా.._
_తెలంగాణ ఆంధ్ర విడిపోయి మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన మైనార్టీ సంస్థల డిపాజిట్లు డబ్బులు కోట్ల రూపాయలు ఎందుకు తీసుకురాలేదు.._
_ఆదాయం వచ్చే దర్గాలన్నీ వక్ఫ్ చేతిలో ఉన్న మాట వాస్తవం కాదా. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కోసం ముతవల్లిలను సస్పెండ్ చెయ్యటం మీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమేనా…_
_ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కృష్ణాజిల్లా గవర్నమెంట్ ఖాజీ సయ్యద్ హబీబుల్లా హుసేని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఇద్దరు శాసన సభ్యులు తో వెళ్లి సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారిని కలిస్తే వక్ఫ్ అధికారులు ఖాజీ ను సస్పెండ్ చేస్తారా_ ..
_ముస్లింలను అణచివేసే విధానం కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాం…_




