అన్నమయ్య జిల్లా సాయుధ దళాల (ఏఆర్) డీఎస్పీగా ఏడుకొండల రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లిలోని డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ విభాగంలో క్రమశిక్షణ, సిబ్బంది సంక్షేమంపై దృష్టి పెట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు క్రమశిక్షణతో సేవలందిస్తానని ఏఆర్ డీఎస్పీ హామీ ఇచ్చారు.




