AP: వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు కౌంటర్ వేశారు. శనివారం నగరిలో ఆయన మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మర్చిపోతే వినాశనమే. రూ.700 కోట్లు పెట్టి ఆయన ఫోటో పెట్టుకున్నారు. ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు వస్తాయి.
నేను క్రెడిట్ చోరీ చేశానంటున్నారు. ఆయనకేం క్రెడిట్ ఉంది. నేను చేతకాని వాడనని.. మా నాయనతో పనిచేశారు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని వాగుతున్నారు. ఇలాంటి చెత్త పనులు నేను చేయాలా?’ అని ప్రశ్నించారు.




