కర్నూలు సిటీ :
జిల్లా పోలీసు కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు… జాతీయ పతాకావిష్కరణ చేసిన… జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.జిల్లా కలెక్టర్ గారు, కర్నూలు ఎస్పీ గారితో కలిసి పెరేడ్ వీక్షణ చేసి, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ గారు సందేశాన్ని చదివి వినిపించారు.స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. విధులలో ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి, అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ , అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




