అన్నమయ్య జిల్లా జేసీ శివ నారాయణ శర్మ ఆదివారం మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని
ఓటు వేయడం ద్వారా దేశ భవిష్యత్తును మార్చగల శక్తి యువతకు ఉందని అన్నారు. కొత్త ఓటర్లకు ఓటరు కార్డులు పంపిణీ చేసిన ఆయన, ఓటర్ కార్డు పొందడం ద్వారా యువకులు తమ పౌరసత్వ హక్కులను పరిరక్షించుకోవచ్చని, సమాజానికి తమ వంతు సేవ చేయవచ్చని తెలిపారు.




