స్థానిక మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాలలో జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ప్రిన్సిపల్ షఫీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్
సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నారాయణ విద్యాసంస్థల డిజిఎం కొండలరావు, ఏజీఎం ఫణి కుమార్, ఆర్ ఐ ఆంజనేయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కోఆర్డినేటర్లు, పాఠశాల ఏవో, వైస్ ప్రిన్సిపల్, అకడమిక్ డీన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




