మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం బీటీ కళాశాల మైదానం సిద్ధమవుతోంది. ఈసారి గణతంత్ర దినోత్సవంతో పాటు ఓటర్స్ డే కార్యక్రమాలు ఒకే వేదికపై జరగనున్నాయి.
జిల్లాలోని పోలీసు శాఖతో పాటు వివిధ విభాగాల సిబ్బంది పరేడ్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, DSP మహేంద్ర, సీఐలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ రిహార్సల్స్ నిర్వహించారు.
వేడుకలు సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.






