ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఓటరు బాధ్యత అని కడెం తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో విద్యార్థులు.
నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి ఓటుపై ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
# saketh




