కర్నూలు : నంద్యాల : డోన్
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని
ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, తమ విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న ఉద్యోగులను ఎమ్మెల్యే గారు అభినందించారు.ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి, వారి సేవలను ప్రశంసించారు. ఇలాంటి ఉద్యోగుల కృషి వల్లనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతోందని తెలిపారు.






