Tuesday, January 27, 2026
spot_img
HomeSouth ZoneTelanganaజననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|

జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో అంబరాన్నంటాయి. మచ్చ బొల్లారం (డివిజన్ 133) కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని  మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
” రెపరెపలాడిన జాతీయ పతాకం

అల్వాల్ లోని రాజీవ్ గాంధీ సర్కిల్, ఎంజీ నగర్, సప్తగిరి ఎంక్లేవ్, గోపాల్ నగర్ సర్కిల్, జిఎంఆర్ కాలనీ వంటి పలు ప్రాంతాల్లో నిర్వహించిన  పథకావిష్కరణ కార్యక్రమాల్లో మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాఫలాలను ప్రతి పేదవాడికి అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన రాకతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం మేలుకొంది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, సిఎల్ యాదగిరి, సురేష్, ఉదయ్ కుమార్, భాస్కర్,  బలవంత్ రెడ్డి, నాగేశ్వర్ రావ్, సూర్య కిరణ్, రాజనర్సింహారెడ్డి, కృష్ణ గౌడ్, సంజీవ, తదితరులు పాల్గొన్నారు.

” కార్యకర్తల కోలాహలం :”
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మహిళా విభాగం, ఎన్ ఎస్ యు ఐ  (NSUI) ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై హింద్, మైనంపల్లి హనుమంతరావు నాయకత్వం వర్ధిల్లాలి, అన్న నినాదాలతో అల్వాల్ ప్రాంతం మారు మోగింది.

#sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments